Andhra Pradesh: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న ఏపీ ప్రభుత్వం

  • పంపిణీకి టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • జిల్లా టాస్క్ ఫోర్స్ లో 31 మంది సభ్యులు
  • రాష్ట్ర టాస్క్ ఫోర్స్ లో 16 మంది సభ్యులు
AP govt making arragements for Corona vaccine distribution

వచ్చే నెల నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తోంది. వ్యాక్సిన్ పంపిణీ కోసం అర్బన్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా టాస్క్ ఫోర్స్ కమిటీల్లో సవరణలు చేసింది. అర్బన్ టాస్క్ ఫోర్స్ లో మునిసిపల్ శాఖ కమిషనర్ ఛైర్మన్ గా 9 మంది సభ్యులతో కమిటీని నియమించింది. జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలో 31 మంది అధికారులు సభ్యులుగా ఉంటారని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర టాస్క్ ఫోర్స్ లో 16 మంది సభ్యులుగా ఉంటారు.

More Telugu News