KTR: ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించిన మంత్రి కేటీఆర్

KTR reviews Warangal corporation development
  • వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష
  • రూ.1000 కోట్లతో అభివృద్ధి
  • ఏటా రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయింపులు
  • అభివృద్ధి నమూనా సిద్ధం చేయాలంటూ ఆదేశాలు
వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్ లో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు షురూ చేస్తామని చెప్పారు. వరంగల్ కు ప్రతి ఏటా రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని వెల్లడించారు. వచ్చే ఉగాది నుంచి గ్రేటర్ వరంగల్ లో ప్రయోగాత్మకంగా రోజూ తాగునీరు సరఫరా చేస్తారని తెలిపారు.

వరంగల్ లో భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలకు సత్వరమే మరమ్మతు చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. వరంగల్ అభివృద్ధి నమూనా, భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
KTR
Warangal Corporation
Review
Development

More Telugu News