Dharmapuri Arvind: ఎప్పుడూ గుండుతో ఎందుకుంటారో చెప్పిన బీజేపీ ఎంపీ అరవింద్

Dharmapuri  Arvind funny comments on his look
  • తరచుగా తిరుపతికి  వెళ్లి గుండు కొట్టించుకోవడం వల్ల ఇలా ఉండి పోయాను
  • కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి
  • మార్కెట్ యార్డుల్లో నిలుచోవాల్సిన అవసరం ఉండదు

తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పై పదునైన విమర్శలు గుప్పించే బీజేపీ నేతల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకరు. మరోవైపు, ఆయన ఎప్పుడూ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుంటారు. గుండుతో స్టైలిష్ లుక్ మెయిన్ టైన్ చేస్తుంటారు. తన లుక్ కు సంబంధించి తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గుండుతో కనిపించడానికి గల కారణం ఏమిటో చెప్పి అందరినీ నవ్వించారు. తరచుగా తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకోవడం వల్ల తాను శాశ్వతంగా ఇలా ఉండిపోయానని చెప్పారు.

గతంలో తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలంటే భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేదని... ఇప్పుడు సుదర్శన టోకెన్లు రావడంతో దర్శనం త్వరగా అయిపోతోందని అరవింద్ అన్నారు. ఇదే సమయంలో కొత్త వ్యవసాయ చట్టాలపై మాట్లాడుతూ, రైతులకు కొత్త చట్టాలు సుదర్శన టోకెన్ల వంటివని చెప్పారు. కొత్త చట్టాలతో మార్కెట్ యార్డులలో నిల్చోవాల్సిన అవసరం రైతులకు ఉండదని అన్నారు. ఈ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు.

  • Loading...

More Telugu News