Jagan: జగన్ గారూ... మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలి: బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

Modi Wishes to Jagan on his Birthday
  • నేడు వైఎస్ జగన్ పుట్టిన రోజు
  • ట్విట్టర్ వేదికగా మోదీ శుభాకాంక్షలు
  • అభినందనలు తెలిపిన పలువురు
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు నేడు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ట్విట్టర్ ఖాతాలో "ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాభినందనలు. సుదీర్ఘకాలం పాటు మీరు ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా" అన్నారు.

లోక్ సభ స్పీకర్ తన ట్విట్టర్ ఖాతాలో "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజల సేవలో మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తున్నాను" అని తెలుగులో ట్వీట్ పెట్టారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సామాజిక మాధ్యమాల వేదికగా జగన్ కు అభినందనలు తెలిపారు. "ప్రియతమ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజారంజకంగా పాలించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా" అని ఆకాంక్షించారు.
Jagan
Narendra Modi
Birthday
Wishes
Twitter

More Telugu News