China: బెదిరింపులు ఆపకుంటే ప్రతీకార చర్యలు తప్పవు: అమెరికాకు చైనా ఘాటు హెచ్చరిక

  • చైనా కంపెనీలపై వేటు కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన అమెరికా
  • ఇరు దేశాల మధ్య దారుణంగా దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలు
  • తమ కంపెనీలను ఎలా కాపాడుకోవాలో తెలుసన్న చైనా
China warns america over trade war

అమెరికా ఇప్పటికైనా తమను బెదిరించడం మానుకోవాలని, లేకుంటే ప్రతీకార చర్యలు తప్పవని చైనా హెచ్చరికలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరుకోగా, తాజాగా చైనా కంపెనీలను తమ స్టాక్ ఎక్స్చేంజీల నుంచి అమెరికా డీలిస్ట్ చేసింది.

ఇందుకోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన చట్టంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేశారు. చైనా మిలటరీతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో పలు కంపెనీలను నిషేధించిన యూఎస్.. తాజాగా మరో 59 కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. ఇందులో చైనాకు చెందిన అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఎస్ఎంఐసీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో చైనా ఈ హెచ్చరికలు జారీ చేసింది.

అమెరికా ఏకపక్షవాదాన్ని అమలు చేస్తోందని చైనా పరిశ్రమల శాఖ మండిపడింది. విదేశీ కంపెనీలను అణచివేయడానికి ఎగుమతి నియంత్రణలు, ఇతర చర్యలు చేపట్టడాన్ని తప్పుబట్టిన చైనా.. తమ కంపెనీలను రక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని నొక్కి చెప్పింది.

  • Loading...

More Telugu News