Nitin: గాయని సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీని స్వయంగా నిర్వహించిన హీరో నితిన్!

Hero Nitin Arranged Singer Sunita Pre Wedding Party in Star Hotel
  • ఇటీవల సునీత, రామ్ నిశ్చితార్థం
  • కొన్ని కారణాలతో వివాహం వాయిదా
  • నితిన్ ఇచ్చిన పార్టీకి పలువురు సెలబ్రిటీల హాజరు
ఇటీవల 'మ్యాంగో' రామ్ తో నిశ్చితార్థం చేసుకున్న గాయని సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీ హైదరాబాద్, గచ్చిబౌలీలోని ఓ స్టార్ హోటల్ లో పలువురు సెలబ్రిటీలు, గాయనీ గాయకుల మధ్య వైభవంగా సాగింది. ఈ పార్టీని రామ్ కు అత్యంత సన్నిహితుడైన హీరో నితిన్ స్వయంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ నెలలో జరగాల్సిన వీరిద్దరి వివాహం వాయిదా పడగా, పెళ్లికి ఇంకా సమయం ఉండటంతో, నితిన్ ఈ పార్టీని హోస్ట్ చేశాడు.

ఇక, శనివారం రాత్రి ఈ పార్టీ జరుగగా, ఇందులో పాల్గొన్న సునీత, రామ్ జంట, కేక్ ను కట్ చేసి ఆనందంగా తినిపించుకుంటున్న చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేణు దేశాయ్, సుమ కనకాల వంటి వారు హాజరై, కాబోయే దంపతులకు శుభాభినందనలు తెలిపారు.
Nitin
Sunitha
Ram
Pre Wedding Party

More Telugu News