KCR: తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు ఆర్థిక సాయం చేశా: విజయశాంతి

dont take revange on kcr says vijayashanti
  • తెలంగాణలో అధికారంలోకి వస్తాం
  • కేసీఆర్ నిరంకుశ విధానాల వల్లే ప్రజలు బీజేపీవైపు
  • కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆసక్తి లేదు
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు తాను ఆర్థికసాయం చేశానని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఆ డబ్బులు దారి మళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతి మొత్తాన్ని వెలికి తీస్తామని, అప్పటి వరకు బీజేపీ ఆయనను వదిలిపెట్టబోదని హెచ్చరించారు.

కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశం, ఆసక్తి తనకు లేవన్న విజయశాంతి.. ఆయన నిరంకుశ విధానాలే ప్రజలు బీజేపీ వైపు చూడడానికి కారణమవుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.
KCR
Telangana
Vijayashanti
BJP

More Telugu News