Jupiter: రేపు రాత్రి వినువీధిలో కనువిందు చేయనున్న అద్భుత దృశ్యం!

  • అత్యంత సమీపానికి రానున్న గురు, శని గ్రహాలు
  • ఒకే వెలుగులా దర్శనం
  • 2 వేల ఏళ్ల క్రితం ఇలాంటిదే ఘటన
  • స్టార్ బెత్లహాం సాక్షాత్కారం అవుతుందంటున్న శాస్త్రవేత్తలు
  • నైరుతి దిశలో కనిపించనున్న గ్రహాలు
Jupiter and Saturn comes very close to each other

నవగ్రహ వ్యవస్థలో రేపు అరుదైన ఘటన జరగనుంది. గురు, శని గ్రహాలు తమ కక్ష్యల్లో ప్రయాణిస్తూనే ఒకదానికొకటి అత్యంత చేరువలోకి రానున్నాయి. ఈ రెండు ఎంత దగ్గరగా వస్తాయంటే చూపరులకు ఒకదాన్ని ఒకటి తాకుతున్నట్టుగా అనిపిస్తాయి. తద్వారా ఒక పెద్ద వెలుగు ఆకాశంలో సాక్షాత్కారం కానుంది. దీన్ని స్టార్ ఆఫ్ బెత్లహాం అంటారు.

కాగా, ఖగోళ చరిత్రలను పరిశీలిస్తే 2,000 ఏళ్ల కిందట ఆకాశంలో ఓ దేదీప్యమానమైన వెలుగు కనిపించిందని పేర్కొంటుంటారు. రేపు డిసెంబరు 21 రాత్రిన కనువిందు చేయబోయేది అలాంటి వెలుగేనని, అది మళ్లీ పునరావృతం అవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా, సాయంత్రం నుంచే ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి సమీపానికి రావడం గమనించవచ్చు. సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో నైరుతి దిశలో ఈ గ్రహాలు దర్శనమిస్తాయని పరిశోధకులు అంటున్నారు.

More Telugu News