Pant: రెండో టెస్టుకు టీమిండియాలో పంత్, గిల్!

Pant and Gill will be played in second test against Australia
  • తొలి టెస్టులో టీమిండియా ఓటమి
  • విఫలమైన పృథ్వీ షా, సాహా
  • జట్టులో మార్పులు చేయాలని భావిస్తున్న టీమిండియా మేనేజ్ మెంట్
  • షమీ స్థానంలో సిరాజ్!
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన భారత జట్టులో పలు మార్పులు జరగనున్నాయి. పేలవంగా ఆడుతున్న ఓపెనర్ పృథ్వీ షా స్థానంలో యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ తుదిజట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ క్వారంటైన్ కారణంగా మూడో టెస్టు వరకు అందుబాటులోకి రావడం వీలుకాని నేపథ్యంలో మయాంక్ అగర్వాల్ కు జోడీగా గిల్ ను బరిలో దింపనున్నారు.

అదేసమయంలో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ను కూడా రెండో టెస్టు ఆడే టీమిండియా నుంచి తప్పించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. సాహా స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆసీస్ తో ప్రాక్టీసు మ్యాచ్ లో పంత్ మెరుపు సెంచరీ సాధించి తన ఫామ్ చాటుకున్నాడు.

ఇక, అడిలైడ్ టెస్టులో గాయపడిన పేసర్ షమీ స్థానంలో సిరాజ్ ఆడే అవకాశాలున్నాయి. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 26న ప్రారంభం కానుంది.
Pant
Gill
Team India
Australia

More Telugu News