Bigg Boss Telugu 4: బిగ్ బాస్-4 గ్రాండ్ ఫినాలే ప్రారంభం

Bigg Boss season four grand finale starts
  • 100 రోజులుగా కొనసాగుతున్న గ్రాండ్ రియాల్టీ షో
  • నేటితో సమాప్తి
  • టైటిల్ రేసులో ఐదుగురు
  • ఆసక్తిరేపుతున్న ప్రోమో
గత 100 రోజులకు పైగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇవాళ గ్రాండ్ ఫినాలే జరుపుకుంటోంది. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్-4 విన్నర్ ఎవరో తేలిపోనుంది. లీకులు, ఊహాగానాల సంగతి అటుంచితే... ఇప్పటికే విడుదలైన గ్రాండ్ ఫినాలే ప్రోమో ఫైనల్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి పెంచుతోంది. ప్రోమో చూస్తే లక్ష్మీరాయ్, ప్రణీత, మెహ్రీన్ బిగ్ బాస్ వేదికపై తళుక్కున మెరవనున్నట్టు తెలుస్తోంది. యువ దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి ఎలిమినేట్ అయిన వారిని బయటికి తీసుకురానున్నారు.

మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పోటీచేసిన బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఫైనల్ వీక్ కు ఐదుగురు మిగిలారు. అభిజిత్, అఖిల్, అరియానా, సొహైల్, హారిక టైటిల్ రేసులో ఉరకలేస్తున్నారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన 14 మంది ఇంటి సభ్యులు కూడా గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు రావడంతో మరింత సందడి నెలకొంది.            
Bigg Boss Telugu 4
Grand Finale
Reality Show
Title

More Telugu News