Harish Rao: పర్యావరణ హిత, ప్లాస్టిక్ రహిత పద్ధతిలో వివాహం... అభినందించిన మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao appreciates an eco friendly wedding in Siddipet
  • ఓ వ్యాపారి ఇంట పెళ్లి వేడుక
  • ఎక్కడా ప్లాస్టిక్ వాడకుండా వివాహం, విందు
  • అరిటాకుల్లో భోజనం
  • వస్త్రంపైనే పెళ్లి వివరాల ముద్రణ
  • కాగితపు సంచుల్లో కానుకలు
  • ట్విట్టర్ లో ఫొటోలు పంచుకున్న హరీశ్ రావు
సిద్ధిపేటకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి ఇంట జరిగిన వివాహ వేడుకను మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సిద్ధిపేటకు చెందిన ప్రముఖ వ్యాపారి నేతి కైలాసం, భ్రమరాంబ దంపతులు తమ కుమార్తె వివాహాన్ని పర్యావరణ హిత రీతిలో ప్లాస్టిక్ రహితంగా, గో సంరక్షణ ప్రాధాన్యత తెలిపేలా నిర్వహించారంటూ హరీశ్ రావు అభినందనలు తెలిపారు. నూతన వధూవరులు శ్రావ్య, సందీప్ లకు శుభాకాంక్షలు అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా హరీశ్ రావు పంచుకున్నారు.

కాగా, ఆ పెళ్లికి వచ్చిన వారికి ఇచ్చిన కానుకలను కూడా కాగితపు సంచుల్లోనే ఇచ్చారు. పెళ్లి విందు కోసం ఎంచక్కా అరిటాకులు ఉపయోగించారు. చివరికి పెళ్లి బ్యానర్ ను సైతం ఓ వస్త్రంపైనే ముద్రించి ప్రదర్శించారు తప్ప ఫ్లెక్సీల జోలికి పోలేదు. ఈ పెళ్లికి హాజరైన మంత్రి హరీశ్ రావు వధూవరులకు తన ఆశీస్సులు అందజేశారు.
Harish Rao
Eco Friendly Marriage
Siddipet
Plastic Less

More Telugu News