వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కరోనా పాజిటివ్

20-12-2020 Sun 16:16
  • ప్రజాప్రతినిధులను కూడా వదలని కరోనా
  • ఎంపీ మాగుంటకు కరోనా పరీక్షలు
  • ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • మాగుంట ఆరోగ్యం నిలకడగానే ఉందన్న కార్యాలయం
YSRCP MP Magunta Srinivasulu Reddy tested corona positive
కరోనా బారినపడిన ప్రజాప్రతినిధుల జాబితాలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా చేరారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం మాగుంట చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాగుంటకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని ఆయన కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మాగుంట ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఆ ట్వీట్ లో తెలిపారు.

కాగా, మునుపటితో పోల్చితే ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గిందనే చెప్పాలి. గత వేసవిలో వేల సంఖ్యలో వచ్చిన కొత్త కేసులు ఇప్పుడు వందల్లోనే వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వేళ్లమీద లెక్కబెట్టగలిగే స్థితిలో కేసులు వస్తున్నాయి.