Hyderabad: నెమలి బొమ్మపై నెమలి... హైదరాబాద్ లో అబ్బుర పరిచిన దృశ్యం!

  • హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ వద్ద కనిపించిన దృశ్యం
  • నెమలి బొమ్మపై వాలి సందడి చేసిన నెమలి
  • సెల్ ఫోన్లలో బంధించిన వాకర్లు
Peacock at KBR Park

హైదరాబాద్ లో ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ వద్ద ఓ సుందర దృశ్యం వీక్షకులను అబ్బుర పరిచింది. ఈ పార్క్ ప్రధాన ద్వారం వద్ద రెండు భారీ నెమళ్ల ఆకృతి చూపరులను ఆకర్షిస్తూ ఉంటుంది. నిన్న ఉదయం పార్క్ లో ఉన్న ఓ నెమలి వచ్చి, ఈ ఆకృతిపై వాలగా, దాన్ని ఆ సమయంలో అక్కడికి వచ్చిన వాకర్లు చూసి తమ సెల్ ఫోన్లలోని కెమెరాల్లో బంధించారు. చూపరులను ఈ దృశ్యం ఎంతో ఆకర్షించింది. నెమలి బొమ్మపై ఉన్న నెమలి కాసేపు అటూ ఇటూ తిరిగి ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయింది.

More Telugu News