Chiranjeevi: సమంతా... మా ఫ్రిజ్ లో నువ్వు అనుకున్నవి ఉండవు: చిరంజీవి!

Chiranjeevi with Samantha in Samjam
  • సమంత హోస్ట్ గా 'సామ్ జామ్'
  • ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో కార్యక్రమం
  • తదుపరి ఎపిసోడ్ లో మెగాస్టార్
టాలీవుడ్ బ్యూటీ, అక్కినేని వారింటి కోడలు సమంత హోస్ట్ గా మొదలైన 'సామ్ జామ్' కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన చిరంజీవి, తన తాజా చిత్రం 'ఆచార్య' గురించిన విషయాలను పంచుకుంటూనే నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఆ విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రిస్మస్ కానుకగా, ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

ఇక ఇందులో చిరంజీవిని ఆట పట్టించాలని సమంత ప్రయత్నించగా, చిరు సైతం దీటుగానే సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. "మీ ఇంట్లోని ఫ్రిజ్ లో ఎప్పుడైనా ఉండే ఐటమ్ ఏంటి?" అని సమంత ప్రశ్నించగా, "సమంతా... మీరు అనుకునేది మాత్రం కాదు" అంటూ మెగాస్టార్ చురకలేశారు. కాగా, 'సామ్ జామ్' కార్యక్రమంలో ఇప్పటివరకూ తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, రానా, క్రిష్ తదితరులు పాల్గొన్న సంగతి తెలిసిందే.

Chiranjeevi
Samantha
Sam Jam
Aha
Ott

More Telugu News