Madhya Pradesh: ఉజ్జయిని మహాకాళ్ పక్కనే వెలుగులోకి వచ్చిన పురాతన ఆలయం!

Old Temple Found in Madhyapradesh
  • మహాకాళ్ ఆలయం విస్తరణలో భాగంగా తవ్వకాలు
  • వెలుగులోకి వచ్చిన కళాకృతులు, ఆలయం నమూనా
  • పూర్తిగా తవ్విన తరువాత వివరాలు వెల్లడిస్తామన్న పురాతత్వ శాఖ
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళ్ అలయం పక్కనే దాదాపు వెయ్యి సంవత్సరాల నాటి పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరుగుతున్న వేళ, ఈ అద్భుతం జరిగింది. పురాతన కళాకృతులు, ఆలయం నమూనాలు బయటపడటంతో విషయం తెలుసుకున్న పురాతత్వ విభాగం అధికారులు ఆలయం వద్దకు చేరుకుని, దాన్ని పరిశీలిస్తున్నారు.

ఈ ప్రాంతంలో పురాతన ఆలయం వెలుగులోకి రావడం ఇదే తొలిసారని స్థానికులు అంటున్నారు. పూర్తిగా తవ్వకాలు జరిపి, ఆలయాన్ని వెలుగులోకి తెస్తే, దాని నిర్మాణంపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
Madhya Pradesh
Mahakal
Old Temple

More Telugu News