బ్రెజిల్ లో తాబేళ్ల సునామీ... వీడియో ఇదిగో!

  • పురస్ నదీతీరంలో తాబేళ్ల సంతానోత్పత్తి
  • ఒక్కసారిగా గుడ్ల నుంచి బయటికి వచ్చిన తాబేలు పిల్లలు
  • ఒక్కరోజులో 71 వేల పిల్లల జననం
  • వైరల్ అవుతున్న వీడియో
Turtle Tsunami in Brazil

ప్రతి ఏటా నిర్దిష్ట కాలంలో భారత్ లో ఒడిశా తీరానికి ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెద్ద సంఖ్యలో వచ్చి గుడ్లు పెట్టి తమ సంతానోత్పత్తి చేసుకుంటాయి. ఇదే విధంగా బ్రెజిల్ లోని పురస్ నది తీరానికి కూడా భారీగా తాబేళ్లు వస్తుంటాయి. అయితే, ఈ తాబేళ్లు పెట్టిన గుడ్ల నుంచి ఒక్కసారిగా పిల్ల తాబేళ్లు బయటికి రావడంతో ఆ ప్రాంతమంతా తాబేళ్ల మయం అయింది.

పురస్ నది ప్రఖ్యాత అమెజాన్ నదికి ఉపనది. అయితే సంతానోత్పత్తి సమయంలో మంచినీటి తాబేళ్లు అమెజాన్ గుండా ప్రయాణించి పురస్ నదిలో ప్రవేశిస్తాయి. ఈ జెయింట్ సౌత్ అమెరికన్ రివర్ తాబేళ్లు అక్కడి తీరంలో గుడ్లు పొదుగుతాయి. ఈ తాబేళ్లు ఒక మీటరుపైగా పొడవు పెరుగుతాయి. తాజాగా ఈ తీరంలో ఒక్కరోజే 71 వేల తాబేలు పిల్లలు దర్శనమిచ్చాయి. ఆ తర్వాత మరో 21 వేల పిల్లలు పుట్టుకొచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోను వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ పంచుకుంది. ఇందులో తాబేలు పిల్లలు సంఖ్యలో దర్శనమిస్తూ కనువిందు చేశాయి.

More Telugu News