Narendra Modi: ఈ లేఖను అన్నదాతలందరూ చదవాలని నా విన్నపం: పలు భాషలలో మోదీ ట్వీట్

Modi appeals to all must read Agriculture minister letter
  • వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు
  • వీడని ప్రతిష్టంభన
  • రైతుల్లో అవగాహన కోసం వ్యవసాయశాఖ మంత్రి ప్రయత్నం
  • భారతీయ భాషల్లో లేఖ
  • ఈ లేఖను సోషల్ మీడియాలో పంచుకున్న ప్రధాని మోదీ
జాతీయ వ్యవసాయ చట్టాల అంశంలో కేంద్రం, రైతు సంఘాల మధ్య ప్రతిష్టంభన వీడని నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు అన్ని భారతీయ భాషల్లో సుదీర్ఘమైన లేఖ రాశారు. ఈ లేఖపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో స్పందించారు. దీనిపై తెలుగు సహా పలు భాషల్లో ఆయన ట్వీట్ చేశారు.

వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు సోదర సోదరీమణులకు ఓ లేఖ ద్వారా తన భావాలను తెలియజేశారని, మర్యాదపూర్వకమైన చర్చ కోసం ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ లేఖను అన్నదాతలందరూ చదవాలని తన విన్నపం అని మోదీ పేర్కొన్నారు. సాధ్యమైనంత ఎక్కువమందికి ఈ లేఖ చేరేలా చూడాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, నరేంద్ర సింగ్ తోమర్ రాసిన లేఖ లింకును కూడా పంచుకున్నారు.
Narendra Modi
Letter
Narendra Singh Tomar
Agriculture Minister
Farmers
New Laws
India

More Telugu News