Talasani: రెండు ఎన్నికల్లో గెలుపుకే బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారు: తలసాని

Talasani challenges BJP leaders
  • కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు
  • కేసీఆర్ ను అరెస్ట్ చేస్తాం అంటున్నారు
  • అంత ధైర్యం మీకు ఉందా?
బీజేపీ నేతలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వరద బాధితులకు రూ. 25 వేల వంతున ఆర్థిక సాయాన్ని అందించకుంటే బీజేపీ నేతలపై ప్రజలే తిరగబడతారని అన్నారు.

కేవలం రెండు ఎన్నికల్లో గెలుపుకే బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని దుయ్యబట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని ఆకుపాముల గ్రామంలో పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశమంతా గర్వించేలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ఎన్నో ఎన్నికలను చూసిందని, ఒకట్రెండు ఎన్నికలు టీఆర్ఎస్ ను ఏమీ చేయలేవని అన్నారు. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామని, జైలుకు పంపుతామని బీజేపీ నేతలు అంటున్నారని... కేసీఆర్ ను అరెస్ట్ చేసేంత ధైర్యం మీకు ఉందా? అని ప్రశ్నించారు.
Talasani
KCR
TRS
BJP

More Telugu News