Ram Pothineni: ఆ విషయం నన్ను ఎంతో భయపెట్టింది: సినీ హీరో రామ్

Felt afraid when my brother infected with Corona says Ram Pothineni
  • ఈ ఏడాది నా జీవితంలో మర్చిపోలేని ఘటనలు చోటు చేసుకున్నాయి
  • లాక్ డౌన్ వల్ల కుటుంబంతో సమయాన్ని గడిపాను
  • అమ్మకు, సోదరుడికి  కరోనా రావడంతో భయమేసింది
కొన్ని రోజుల్లో 2020 వెళ్లిపోయి కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ నేపథ్యంలో 2020లో తమ అనుభవాలను అభిమానులతో సెలబ్రిటీలు పంచుకుంటున్నారు. టాలీవుడ్ హీరో రామ్ కూడా తన అనుభవాలను పంచుకున్నాడు. కరోనా వల్ల ఈ ఏడాది తన జీవితంలో మర్చిపోలేని ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పాడు. అందులో మంచివి, చెడ్డవి రెండూ ఉన్నాయని తెలిపాడు. లాక్ డౌన్ వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందని చెప్పాడు. ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపాడు. అయితే నెలల తరబడి ఇంట్లోనే కూర్చోవడం వల్ల అప్పుడప్పుడు ఎంతో చికాకుగా కూడా అనిపించేదని చెప్పాడు.

ఈ ఏడాది తన జీవితం అనుకున్నంత సాఫీగా జరగలేదని రామ్ తెలిపాడు. తన సోదరుడు, అమ్మ కరోనా బారిన పడటంతో... తాను ఎంతో భయపడ్డానని చెప్పాడు. చాలా బాధపడ్డానని తెలిపాడు. తన సోదరుడిలో కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించాయని, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని చెప్పాడు. కరోనాకు ఇంకా వ్యాక్సిన్ రాలేదనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలని, కొత్త సంవత్సరంలో కూడా జాగ్రత్తగా ఉండాలని కోరాడు.
Ram Pothineni
Tollywood
2020
Corona Virus

More Telugu News