Budda Venkanna: అధికార పార్టీ నాయకులు పోలీసులను తన్నొచ్చు, తిట్టొచ్చు అంటూ జగన్ కొత్త చట్టం తెచ్చారా?: బుద్ధా వెంకన్న

  • టీడీపీ నేతలు, పోలీసుల మధ్య ట్విట్టర్ వార్
  • చంద్రబాబు ట్వీట్ తో మొదలైన మాటల యుద్ధం
  • ఏపీ పోలీసుల కౌంటర్
  • వైసీపీ నేతల వ్యాఖ్యలపై పోలీసులు స్పందించరేమన్న బుద్ధా
  • దీనికి ఫ్యాక్ట్ చెక్ ఉండదా అంటూ ట్వీట్
Budda Venkanna comments on twitter war between TDP and AP Police

టీడీపీ నేతలకు, ఏపీ పోలీసులకు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ పోలీస్ అధికారిపై వైసీపీ గూండాలు దాడి చేశారన్న రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ట్వీట్ తీవ్ర కలకలం రేపింది. దీనిపై ఏపీ పోలీస్ విభాగం స్పందిస్తూ, అది దాడి కాదని, కిందపడిన పోలీసు అధికారికి వైసీపీ నేతలు సాయం అందిస్తున్నారని వెల్లడించింది. అక్కడ్నించి ఇరువర్గాల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. తాజాగా, ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు.

"గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి బొంగులో పోలీసులు అంటున్నారు. ఆమంచి కొజ్జా పోలీసులు అని దారుణంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం స్పందించదా? అని ప్రశ్నించారు. దీనికి నిజనిర్ధారణ ఉండదా?" అని నిలదీశారు.

"విపక్ష నేతల ట్వీట్లపై వాస్తవాలు తెలుసుకోకుండా స్పందించే ఏపీ పోలీసు ట్విట్టర్ ఖాతాలు వైసీపీ నేతల నోటి..  చూసి కూడా స్పందించవా? లేకపోతే, అధికార పార్టీ నాయకులు పోలీసులను తన్నొచ్చు, తిట్టొచ్చు అని జగన్ కొత్తం చట్టం తెచ్చారా?" అని బుద్ధా వ్యాఖ్యానించారు.

More Telugu News