Price: వచ్చే జనవరి నుంచి కార్లు, బైకుల ధరలు మరింత ప్రియం

  • పెరిగిన ఇన్ పుట్ వ్యయం
  • స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం ధరల పెంపు
  • వాహనాల ధరలు పెంచకతప్పడంలేదన్న ఆటోమొబైల్ కంపెనీలు
  • రూ.28 వేల వరకు పెంచుతున్న రెనో
  • గరిష్టంగా రూ.1,500 వరకు ధర పెంచుతున్నట్టు హీరో వెల్లడి
Price hike in automobile industry

నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో వాహనాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. కార్లు, బైకుల తయారీలో ఉపయోగించే ఉక్కు, ప్లాస్టిక్, అల్యూమినియం ధరలు పెరగడంతో పాటు, ఇతరత్రా ఉత్పత్తి వ్యయం అధికం కావడంతో రెనో, హీరో మోటోకార్ప్ తమ వాహనాల ధరలు పెంచుతున్నట్టు వెల్లడించాయి. మారుతి, మహీంద్రా, ఫోర్డ్ వంటి సంస్థలు ఇప్పటికే ధరల పెంపు ప్రకటన చేశాయి.

తాజాగా, వివిధ కార్ల మోడళ్లపై గరిష్టంగా రూ.28 వేల వరకు పెంచుతున్నట్టు రెనో ప్రకటించింది. ట్రైబర్, క్విడ్, డస్టర్ మోడళ్ల ధరలను త్వరలో సవరించనుంది. పెంచిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అటు, దేశీయ ద్విచక్రవాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ కూడా తన బైక్ మోడళ్లపై రూ.1,500 వరకు పెంచనుంది. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్ పుట్ వ్యయం పెరిగినందున తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని హీరో వెల్లడించింది.

More Telugu News