పెరుమాళ్ టెంపుల్‌లో పూజ‌లు చేసి అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభిస్తా: తమిళనాడు సీఎం ప్రకటన

19-12-2020 Sat 13:35
  • తమిళనాడులో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు
  • ఇప్పటికే డీఎంకే, కమల హాసన్ పార్టీల ప్రచారం షురూ
  • త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రచారం ప్రారంభించనున్న పళనిస్వామి
  • పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం  
palani swamy going to start election campaign

తమిళనాడులో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అప్పుడే ప్రచారానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే, సినీనటుడు కమల హాసన్ కు చెందిన మ‌క్క‌ల్ నీది మ‌య్యం ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించగా, తాజాగా అధికార పార్టీ అన్నాడీఎంకే కూడా ప్రచారాన్ని షురూ చేసేందుకు సిద్ధమైంది.  

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కె.ప‌ళ‌నిస్వామి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం సేలం నుంచి తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నున్నారు. తాజాగా అక్కడ ఓ స‌మావేశంలో సీఎం ప‌ళ‌నిస్వామి పాల్గొని తమ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు. సేంద్ర‌య పెరుమాళ్ టెంపుల్‌లో పూజ‌లు నిర్వ‌హించి,  ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభిస్తాన‌ని ప్రకటించారు. తమిళనాడు వ్యాప్తంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటాన‌ని తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి.