Hyderabad: పెళ్లి బరాత్‌లో తుపాకి, కత్తులతో డ్యాన్స్‌లు.. 'బొమ్మ తుపాకి' అన్న పోలీసులు!

groom dance with pistol in marriage barath
  • హైదరాబాద్ శివారులోని మోయిన్‌బాగ్‌లో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్‌లోని ఓ పెళ్లి బరాత్‌లో కత్తులు, తుపాకితో డ్యాన్స్‌లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బండ్లగూడ మండలం మహ్మద్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆమెర్ షరీఫ్ (27) వివాహం గురువారం రాత్రి మోయిన్‌బాగ్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. పెళ్లికి వెళ్లడానికి ముందు ఇంటి వద్ద బరాత్ నిర్వహించారు.

ఇందులో పాల్గొన్న ఆమెర్ స్నేహితులు కత్తులు ఊపుతూ డ్యాన్స్ చేశారు. స్నేహితుడు ఇచ్చిన తుపాకి పట్టుకుని వరుడు ఆమెర్ చిందేయగా, అతడి సోదరుడు మహ్మద్  ఇమ్రాన్ షరీఫ్, స్నేహితులు జబ్బార్, మహ్మద్‌లు కత్తులతో డ్యాన్స్ చేశారు.

దీనిని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. వీడియో చాంద్రాయణగుట్ట పోలీసుల దృష్టికి చేరడంతో వారు ఆమెర్, ఇమ్రాన్ , జబ్బార్ తదితరులపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారి నుంచి తుపాకి, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, తుపాకి మాత్రం బొమ్మదని పోలీసులు తెలిపారు.
Hyderabad
Marriage
pistol
sword

More Telugu News