Indian Railways: సాధారణ రైళ్లు ఎప్పుడు పట్టాలెక్కుతాయో చెప్పలేం: రైల్వే బోర్డు స్పష్టీకరణ

  • కచ్చితమైన తేదీని చెప్పలేం
  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,089 ప్రత్యేక రైళ్ల ద్వారా సేవలు
  • ఆదాయం గణనీయంగా తగ్గింది
Cant say when will railway services resume fully

కరోనా కారణంగా దేశంలో నిలిచిపోయిన సాధారణ రైళ్ల సేవలు తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ చెప్పలేమని రైల్వే బోర్డు పేర్కొంది. ఈ విషయంలో కచ్చితమైన తేదీని చెప్పడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. రైళ్ల సేవలను పూర్తిస్థాయిలో తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని, తమ అధికారులు ఇప్పటికే పలు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నారని బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ప్రయాణికుల్లో కొవిడ్ భయం ఇంకా అలానే ఉందని, పరిస్థితులు అనుకూలంగా మారిన వెంటనే సాధారణ రైళ్లను పునరుద్ధరిస్తామని తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,089 ప్రత్యేక రైళ్లు సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రయాణికుల ద్వారా రైల్వేకు వచ్చే ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గిందని, ఇది గతేడాదితో పోలిస్తే 87 శాతం తక్కువని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ద్వారా రైల్వేకు రూ. 4,600 కోట్ల ఆదాయం సమకూరినట్టు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇది రూ. 1,500 కోట్లకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 53 వేల కోట్లుగా ఉన్నట్టు యాదవ్ తెలిపారు.

More Telugu News