మమత పార్టీకి రాజీనామా చేసిన సువేందు అధికారికి జడ్ కేటగిరీ సెక్యూరిటీ

18-12-2020 Fri 18:57
  • టీఎంసీ ఎమ్యెల్యే పదవికి సువేందు అధికారి రాజీనామా
  • ఆయన బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం 
  • సువేందు రాజీనామాని అంగీకరించలేదన్న స్పీకర్
Suvendu Adhikari provided with Z Catogiry security

పశ్చిమబెంగాల్ లో రాజకీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. మమతాబెనర్జీపై ధిక్కారస్వరం వినిపించి ఆమె పార్టీకి పలువురు నేతలు ఇప్పటికే రాజీనామా చేశారు. వీరిలో టీఎంసీలో మొన్నటి వరకు కీలక నేతగా వ్యవహరించిన సువేందు అధికారి కూడా ఉన్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారనే చర్చ జరుగుతోంది.

మరోవైపు, టీఎంసీ నుంచి బయటకు వచ్చిన ఆయనకు ఆ పార్టీ శ్రేణుల నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే కారణంతో... కేంద్ర ప్రభుత్వం ఆయనకు జడ్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. ఈ విషయం అధికార వర్గాల నుంచి విశ్వసనీయంగా తెలిసినట్టు పీటీఐ తెలిపింది.

మరోవైపు సువేందు అధికారి ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదించలేదని శాసనసభ స్పీకర్ బిమన్ బెనర్జీ తెలిపారు. సువేందు పంపిన రాజీనామా లేఖ నిర్దేశిత ఫార్మాట్ లో లేదని ఆయన వెల్లడించారు.