తెలంగాణలో కరోనా తొలి టీకాను ఎవరికి వేయబోతున్నారంటే...!
- గాంధీ ఆసుపత్రి నర్సుకు తొలి టీకా వేయాలని నిర్ణయం
- వైద్య సిబ్బందికి తొలి విడతలోనే వ్యాక్సిన్
- వ్యాక్సిన్ అందిన రెండు రోజుల్లోనే పంపిణీ చేయాలని నిర్ణయం
మరోవైపు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ ను ఎవరికి ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి నర్సుకు తొలి వ్యాక్సిన్ ఇచ్చి... కార్యక్రమాన్ని ప్రారంభించాలని వైద్య శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే, దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వైద్య సిబ్బందికి తొలి విడతలోనే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు 16 సంవత్సరాల్లోపు వారికి టీకా వేయబోమని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఆ వయసు వారిపై వ్యాక్సిన్ ను పరీక్షించకపోవడమే దీనికి కారణం.