Niharika: పెళ్లి తర్వాత నిహారిక తొలి పుట్టినరోజు... విషెస్ తెలిపిన భర్త

chaitanya wishes to niharika
  • నిహారిక త‌న‌ భుజాలపై వాలిపోయిన ఫొటో పోస్ట్ చేసిన చైతన్య
  • ‘హ్యాపీ బ‌ర్త్ డే ల‌వ్..’ అని వ్యాఖ్య
  • సంతోషంగా ఉండాలని పోస్టు
మెగా బద్రర్ నాగబాబు కూతురు నిహారిక ఈ రోజు పుట్టినరోజు వేడుకను జరుపుకుంటోంది. ఇటీవలే ఆమెకు చైతన్యతో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత నిహారిక జరుపుకుంటోన్న తొలి పుట్టినరోజు కావడంతో ఆమెకు చైతన్య ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. నిహారిక త‌న‌ భుజాలపై ప్రేమతో వాలిపోయిన ఫొటోను పోస్ట్ చేశాడు.

‘హ్యాపీ బ‌ర్త్ డే ల‌వ్..’ అని ఆయన పేర్కొన్నాడు. ఆమె తనను ఎల్ల‌ప్పుడు ఎంత సంతోషంగా ఉంచుతుందో.. ఆమె కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కాగా, నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్ర‌ముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, గ‌త రాత్రి నిహారిక పుట్టినరోజు వేడుక‌ని జరిపారు.
Niharika
Niharika Konidela
birth day

More Telugu News