Choreographer: 98 కేజీల బరువు తగ్గిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య

Choreographer Ganesh Acharya reveals he lost 98 kgs
  • కొన్ని నెలలపాటు వర్కౌట్లు చేశానన్న గణేశ్ 
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
  • పలు హీరోలకు కొరియాగ్రాఫర్‌గా పనిచేసిన గణేశ్
బాలీవుడ్ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య 98 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 200 కిలోల బరువున్న తాను కొన్ని నెలల పాటు వర్కౌట్లు చేయడం ద్వారా బరువు తగ్గినట్టు తెలిపారు. కపిల్‌శర్మ షోకు సంబంధించిన ప్రోమోలో కనిపించిన గణేశ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఇప్పుడాయన బరువు తగ్గి స్లిమ్‌గా కనిపిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మూడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గణేశ్.. ఏడాదిన్నర నుంచి బరువు తగ్గించుకునేందుకు కష్టపడుతున్నట్టు చెప్పాడు. 2015లో ‘హే బ్రో’ సినిమా కోసం దాదాపు 40 కిలోల బరువు తగ్గినట్టు తెలిపాడు. తాజాగా, 98 కిలోల బరువు తగ్గినట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

బాలీవుడ్‌లో గణేశ్ ఆచార్యకు కొరియోగ్రాఫర్‌గా మంచి పేరుంది. సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, గోవింద, అజయ్ దేవగణ్ తదితరులు నటించిన సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. 2018లో ‘టాయ్‌లెట్’ సినిమాలోని ‘గోరీ తూ లాత్ మార్’ పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును గణేశ్ అందుకున్నాడు.
Choreographer
Bollywood
Gnesh Acharya
lost weight

More Telugu News