Karnataka: స్నేహితురాలి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న కర్ణాటక సీఐడీ మహిళా డీఎస్పీ

  • స్నేహితురాలి ఇంటికి విందుకు వెళ్లి ఆత్మహత్య
  • వివాహమై ఎనిమిదేళ్లైనా పిల్లలు లేరని మనస్తాపం
  • 2017లో సీఐడీ డీఎస్పీగా విధుల్లోకి
Karnataka CID DSP Suicide in friends room

పశ్చిమ బెంగళూరులోని అన్నపూర్నేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న లక్ష్మి (33) ఆత్మహత్య చేసుకున్నారు. విందు కోసం బుధవారం స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఆమె రాత్రి పదిన్నర గంటల సమయంలో స్నేహితురాలి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మిది కర్ణాటక, కోలార్ జిల్లాలోని మలూరు తాలూకా మాస్తి గ్రామం. 2014లో కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సీఐడీ విభాగం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. శిక్షణ అనంతరం 2017లో విధుల్లో చేరారు. విందు అనంతరం గదిలోకి వెళ్లిన లక్ష్మి ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు తలుపులు బద్దలుగొట్టి చూడగా, సీలింగుకి వేలాడుతూ కనిపించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వివాహమై 8 సంవత్సరాలు దాటినా పిల్లలు లేరన్న మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News