Omen: ఇండియా సహా 27 దేశాలపై ఒమన్ ఆంక్షలు!

  • వీసా లేకుండా రావచ్చని 103 దేశాలకు ఆఫర్
  • తాజాగా సవరించిన ఒమన్ ప్రభుత్వం
  • 'షెంజెన్ వీసా' ఉండాలని ఆంక్షలు
Oman Conditions Tourists of India and 26 Other Countries

ఇటీవల 10 రోజుల పర్యటనకు వీసా రహిత ఆహ్వానాన్ని ప్రకటించిన ఒమన్, ఇప్పుడు కొత్త షరతులు విధించింది. మొత్తం 103 దేశాల పౌరులు ఎటువంటి అనుమతులు లేకుండా తమ దేశానికి వచ్చి పర్యటించవచ్చని పేర్కొన్న ఒమన్, ఇప్పుడు ఇండియా సహా 27 దేశాల ప్రజలపై ఆంక్షలు పెట్టింది. వారి పాస్ పోర్టులో 'షెంజెన్ వీసా' ఉండాలని పేర్కొంది. వీరంతా గతంలో యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, జపాన్ దేశాల్లో ఎంట్రీ వీసా స్టాంప్ ను కలిగివుండాలని, అప్పుడే వారికి వీసా రహిత ప్రవేశం ఉంటుందని తెలిపింది. ఇదే సమయంలో పాస్ట్ పోర్టు గడువు 6 నెలల కన్నా తక్కువ ఉండకూడదని, తమ దేశంలో ఖర్చులకు తగినంత డబ్బు బ్యాంకులో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

More Telugu News