Dil Raju: దిల్ రాజు హాఫ్ సెంచరీ... గ్రాండ్ గా ఏర్పాట్లు చేసిన కుమార్తె!

Dil Raju birthday celebrations planned by daughter
  • రేపు దిల్ రాజు పుట్టినరోజు
  • 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న దిల్ రాజు
  • ఘనంగా నిర్వహించాలని కుమార్తె నిర్ణయం
  • టాలీవుడ్ ప్రముఖులందరికీ ఆహ్వానం
  • ఈ సాయంత్రం ఘనంగా విందు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన కుమార్తె హన్షితా రెడ్డి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఈ సాయంత్రం గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నారు. ఈ వేడుకల కోసం టాలీవుడ్ ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపారు. లాక్ డౌన్ సమయంలో రెండో వివాహం చేసుకున్న తర్వాత దిల్ రాజు జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో కుమార్తె హన్షితా రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

మాజీ ఎయిర్ హోస్టెస్ వైఘారెడ్డితో కొన్నినెలల కిందట దిల్ రాజు పెళ్లి జరగ్గా, కరోనా పరిస్థితుల కారణంగా అప్పట్లో ఎవరికీ విందు ఇవ్వలేకపోయారు. ఈ లోటును కూడా భర్తీ చేసేలా నేటి బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించేందుకు కుమార్తె హన్షితా రెడ్డి అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీ సందర్భంగా దిల్ రాజు తన అర్ధాంగి వైఘారెడ్డిని అందరికీ పరిచయం చేస్తారని తెలుస్తోంది.
Dil Raju
Birthday
Celebrations
Hanshitha Reddy
Vaigha Reddy

More Telugu News