Narendra Modi: మై డియర్ ఫ్రెండ్... నువ్వు త్వరగా కోలుకోవాలి: ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఫ్రెంచ్ భాషలో సందేశం పంపిన మోదీ

PM Modi send message to France president in French language
  • కొన్నిరోజుల కిందట యూరప్ నేతలతో మేక్రాన్ భేటీ
  • కరోనా పరీక్షల్లో పాజిటివ్
  • హోంఐసోలేషన్ లోకి వెళ్లిన మేక్రాన్
  • పరిపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని మోదీ ఆకాంక్ష

గత వారం రోజులుగా పలు యూరప్ నేతలతో సమావేశమైన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ (42) కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడికి కరోనా సోకడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ త్వరగా కోలుకోవాలంటూ ఇంగ్లీషుతో పాటు ఫ్రెంచ్ భాషలోనూ ట్వీట్ చేశారు.

"మై డియర్ ఫ్రెండ్ నువ్వు త్వరగా కోలుకోవాలి. పరిపూర్ణ ఆరోగ్యవంతుడివి కావాలి" అని ఆకాంక్షించారు. కాగా, కరోనా పాజిటివ్ అని తెలియగానే ఫ్రాన్స్ దేశాధినేత మేక్రాన్ హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. అటు మేక్రాన్ అర్ధాంగి బ్రిగెట్టే (67)కు పారిస్ లోని ఓ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని వచ్చింది.

  • Loading...

More Telugu News