Jagan: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు అభినందనలు తెలిపిన సీఎం జగన్

  • శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం సక్సెస్
  • కక్ష్యలోకి చేరిన సీఎంఎస్-01
  • హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్
  • ఇస్రో చరిత్రలో మైలురాయి అని అభివర్ణన
  • మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
CM Jagan appreciates ISRO scientists and engineers

సీఎంఎస్-01 కమ్యూనికేషన్ శాటిలైట్ ను పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు అభినందనలు తెలిపారు. ఇస్రో చరిత్రలో మరో మైలురాయి వంటి ఘట్టం అని, ఇలాంటివే మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాక్షించారు. శ్రీహరికోట నుంచి ఈ మధ్యాహ్నం 3.41 గంటలకు నింగికి ఎగసిన పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చి ఇస్రో వర్గాలను ఆనందాత్సోహాల్లో ముంచెత్తింది.

More Telugu News