బీసీ సంక్రాంతి సభకు వచ్చిన వారికి ఫుడ్ పాయిజన్.. ఒకరి మృతి

  • విజయవాడలో ఘనంగా జరిగిన బీసీ సంక్రాంతి సభ
  • పెద్ద సంఖ్యలో హాజరైన బీసీలు
  • మంగళగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు బీసీ సంక్రాంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బీసీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. సభకు వచ్చిన పలువురు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. ముగ్గురు వ్యక్తులను మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి  తరలించగా... బ్రహ్మయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరు బాధితులను మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. బాధితులను మార్కాపురం వాసులుగా గుర్తించారు.
Go Back to Shorts
BC Sankranthi Sabha
YSRCP
Dead

More Telugu News