France: ఫ్రాన్స్ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

France President Emmanuel Macron tests with Corona
  • పోర్చుగీస్ ప్రధాని ఆంటోనియో కోస్టాతో నిన్న భేటీ  
  • నేడు టెస్టులో పాజిటివ్.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన మేక్రాన్
  • వారం పాటు ఐసొలేషన్ లో ఉండే విధుల నిర్వహణ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని అక్కడి అధ్యక్ష భవనం అధికారికంగా ప్రకటించింది. మేక్రాన్ లో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నారని... టెస్టులో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఏడు రోజుల పాటు ఐసొలేషన్ లోనే ఉండి విధులను నిర్వహిస్తారని అధ్యక్ష భవనం తెలిపింది. పోర్చుగీస్ ప్రధాని ఆంటోనియో కోస్టాతో నిన్న మేక్రాన్ భేటీ అయిన సంగతి తెలిసిందే.

యూరప్ లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఫ్రాన్స్ లో మరోసారి లాక్ డౌన్ కూడా విధించారు. ఇప్పటి వరకు ఆ దేశంలో 59 వేలకు పైగా ప్రజలు కరోనా వల్ల మృతి చెందారు. నిన్న ఒక్కరోజే అక్కడ 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
France
President
Emmanuel Macron
Corona Virus

More Telugu News