Anna Lezhneva: హైదరాబాదు ఎయిర్ పోర్టులో సందడి చేసిన పవన్ కుటుంబ సభ్యులు

Pawan Kalyan wife Anna Lezhneva spotted at Hyderabad airport
  • రష్యా నుంచి తిరిగొచ్చిన అన్నా లెజ్నెవా
  • ఎయిర్ పోర్టులో పిల్లలతో కలిసి దర్శనమిచ్చిన వైనం
  • కెమెరాల్లో బంధించిన పవన్ అభిమానులు
  • ఇటీవల నిహారిక పెళ్లికి హాజరు కాని అన్నా
ఇటీవల రాజస్థాన్ లో కొణిదెల నిహారిక పెళ్లి జరగ్గా, ఆ వేడుకలో పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజ్నెవా కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. అయితే అన్నా లెజ్నెవా ఆ సమయంలో భారత్ లో లేదని వెల్లడైంది. రష్యాలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన ఆమె తాజాగా నగరానికి తిరిగొచ్చారు. కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ లతో ఎయిర్ పోర్టులో కనిపించిన అన్నా లెజ్నెవాను గుర్తించిన పలువురు తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తున్నాయి.
Anna Lezhneva
Polena
Mark
Hyderabad
Aiport
Pawan Kalyan

More Telugu News