Galla Jayadev: మీ కోసం ఎన్ని సార్లు జైలుకు వెళ్లడానికైనా నేను సిద్ధమే: జనరణభేరి సభలో గల్లా జయదేవ్

I am ready to go to jail for Amaravati farmers says Galla Jayadev
  • టెర్రరిస్టులపై పెట్టే కేసులు అమరావతి రైతులపై పెడుతున్నారు
  • ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతే
  • నన్ను కూడా ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెడుతోంది
తన తాత రాజగోపాల్ నాయుడు స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారని... అమరావతి రైతుల కోసం తాను కూడా ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. టెర్రరిస్టులపై పెట్టే కేసులు అమరావతి రైతులపై పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా అమరావతి రైతులు పోరాడుతున్నారని ప్రశంసించారు. అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అని అన్నారు. అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన జనరణభేరి సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతికి అండగా ఉన్న తనను కూడా వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెడుతోందని జయదేవ్ అన్నారు. తమ కంపెనీలను ఇబ్బంది పెట్టేందుకు చాలా చేసిందని, అయినా తాను భయపడటం లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదని విమర్శించారు. అప్పులు చేయడం, వాటిని తీర్చడం కోసం ఆస్తులను అమ్ముకోవడం మాత్రమే చేస్తోందని ఎద్దేవా చేశారు.
Galla Jayadev
Telugudesam
Amaravati
Janabheri
YSRCP

More Telugu News