Vijay Sai Reddy: సీఎం జగన్ పెద్ద మనసు కారణంగా బీసీలకు సంక్రాంతి ముందుగానే వచ్చింది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy says Sankranthi for BCs comes early because of CM Jagan
  • విజయవాడలో బీసీ సంక్రాంతి సభ
  • బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్ పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణం
  • బీసీ వర్గాల అభ్యున్నతే తమ ప్రాధాన్యమన్న విజయసాయి
  • సీఎం జగన్ పై ప్రశంసలు
విజయవాడలో బీసీ సంక్రాంతి సభ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీలో బీసీలకు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని పేర్కొన్నారు. సీఎం జగన్ సమక్షంలో అన్ని బీసీ కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, డైరెక్టర్లు పదవీప్రమాణస్వీకారం చేశారని అన్నారు. 139 బీసీ సామాజిక వర్గాల సాధికారతే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

కేవలం ఇది సీఎం జగన్ విశాల హృదయం కారణంగానే సాధ్యమైందని ఉద్ఘాటించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన బీసీ సంక్రాంతి సభకు సీఎం జగన్, వైసీపీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్ పర్సన్లు, డైరెక్టర్లు ఒకేసారి ప్రమాణస్వీకారం చేశారు.
Vijay Sai Reddy
Sankranti
BC
Jagan
BC Sankranthi

More Telugu News