CPI Ramakrishna: ఏపీకి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు: సీపీఐ రామకృష్ణ

AP has one fool as CM says CPI Ramakrishna
  • అధికారంలోకి వచ్చాక ప్రజలను జగన్ దారుణంగా మోసం చేశాడు
  • ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిని సమర్థించాడు
  • రాజధానిని మారుస్తామని మేనిఫెస్టోలో కూడా చెప్పలేదు
ఒక మూర్ఖుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా జగన్ అంగీకరించారని... అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను దారుణంగా మోసం చేశాడని చెప్పారు. మాట తప్పి రైతులను వంచించాడని అన్నారు. పాదయాత్ర సమయంలో కూడా అమరావతికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా జగన్ మాట్లాడలేదని... వైసీపీ మేనిఫెస్టోలో కూడా రాజధానిని మారుస్తామని చెప్పలేదని... అధికారంలోకి రాగానే అందరినీ  మోసం చేశాడని విమర్శించారు.

రాజధానిని కాపాడుకోవాలని రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమానికి పోటీగా ధర్నాలు చేయిస్తారా? అని రామకృష్ణ దుయ్యబట్టారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేయడం మీ తరం కాదని అన్నారు. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతు నాయకులను కూడా అమరావతి ఉద్యమంలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు కూడా చాలా దారుణంగా జరుగుతున్నాయని అన్నారు. దేశంలో ఏ అసెంబ్లీలోనైనా ఇంత అధ్వానంగా చట్టాలు చేస్తారా? అని మండిపడ్డారు. జగన్ ఇప్పటికైనా అమరావతి విషయంలో నిర్ణయం మార్చుకోవాలని హితవు పలికారు.
CPI Ramakrishna
Jagan
YSRCP
Amaravati
Janabheri

More Telugu News