Anand Mahindra: మనిషి ముఖంలో కలిసిపోయినట్టుండే కళాత్మక మాస్కులపై ఆనంద్ మహీంద్రా స్పందన

Anand Mahindra praises new type of masks
  • వ్యక్తుల ముఖాల్లో కలిసిపోయేలా మాస్కుల రూపకల్పన
  • జార్జ్ లోరిజ్ అనే చిత్రకారుడి నైపుణ్యం
  • మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకున్నట్టేనన్న ఆనంద్ మహీంద్రా
  • సోషల్ మీడియాలో వీడియో పంచుకున్న వైనం
సోషల్ మీడియాలో ఏమాత్రం వింతగా, విడ్డూరంగా అనిపించినా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టి నుంచి అది తప్పించుకోలేదు. తాజాగా ఆయన కొత్తరకం మాస్కులపై తన స్పందనను పంచుకున్నారు. వ్యక్తుల ముఖాలను పోలిన మాస్కులను చూసి ఆయన నిబిడాశ్చర్యానికి గురయ్యారు. ఎంతటి గొప్ప తయారీ అంటూ మెచ్చుకున్నారు. ప్రతి సందర్భానికి తగిన విధంగా కళాకారులు కొత్త రీతులను కనుగొంటారని పేర్కొన్నారు.

"ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ మాస్కులు ధరిస్తే తాత్కాలిక మీసం, తాత్కాలిక గడ్డంతో మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకున్నట్టే ఉంటుంది" అని వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. జోర్జ్ లోరిజ్ అనే కళాకారుడు వ్యక్తుల ముఖాల్లో ముక్కు నుంచి కిందిభాగాన్ని మాస్కులపై చిత్రించి నిజంగా వ్యక్తుల ముఖాలే అని భ్రమింపచేయడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
Anand Mahindra
Masks
Painting
Jorge Roriz

More Telugu News