Regular Shooting: మరిన్ని నవ్వులు పూయించేందుకు 'ఎఫ్-3' షూటింగ్ మొదలు!

F3 Shooting Starts
  • గత సంవత్సరం విడుదలైన ఎఫ్-2
  • దానికి కొనసాగింపుగా మరో చిత్రం
  • 23 నుంచి రెగ్యులర్ షూటింగ్
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా గత సంవత్సరం విడుదలైన 'ఎఫ్-2' (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా అదే టీమ్ 'ఎఫ్-3' పేరిట మరో సినిమాను నిర్మించడానికి తలపెట్టగా, ఈ ఉదయం ముహూర్తాన్ని నిర్ణయించి, షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు.

సినిమా రెగ్యులర్ షూటింగును 23 నుంచి ప్రారంభించనున్నామని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. తమ వద్ద మరింత ఫన్, ఫ్రస్ట్రేషన్ ఉందని, మరింత వినోదానికి సిద్ధంగా ఉండాలని వెల్లడించింది. ఇక ముహూర్తపు షాట్ ను వరుణ్ తేజ్, తమన్నాలపై అల్లు అరవింద్ క్లాప్ కొట్టి ప్రారంభించారు.
Regular Shooting
Muhurtham
Shot
F2
F3

More Telugu News