60 ఏళ్లు దాటిన వారికి సగం ధరకే టికెట్: ఎయిర్ ఇండియా బంపరాఫర్
- 50 శాతం రాయితీని ప్రకటించిన ఎయిర్ ఇండియా
- ప్రయాణానికి వారం ముందు కొనాలి
- ఎకానమీ క్లాస్ కు మాత్రమే ఆఫర్
- వెల్లడించిన ఎయిర్ ఇండియా
ఆఫర్ లో టికెట్లను పొందే వారు తప్పనిసరిగా భారతీయులై ఉండాలని లేదా శాశ్వతంగా ఇక్కడ ఉంటున్నవారే అయ్యుండాలని పేర్కొంది. టికెట్లు పొందేవారు బోర్డింగ్ సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ వంటి వయసును నిర్ధారించే గుర్తింపు కార్డును కలిగివుండటం తప్పనిసరని, ప్రయాణానికి కనీసం వారంరోజుల ముందుగా టికెట్ ను బుక్ చేసుకోవచ్చని, ఏడాదిలోపు ప్రయాణపు తేదీ వరకూ తమకు నచ్చిన సర్వీసులో టికెట్ ను తీసుకోవచ్చని వెల్లడించింది.