India: తొలిసారిగా గులాబీ బాల్ తో టెస్ట్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్!

Toss Won by India and Choose to Bat on Pink Ball Test
  • అడిలైడ్ వేదికగా మ్యాచ్
  • 26వ టెస్ట్ లో టాస్ గెలిచిన విరాట్
  • కోహ్లీ టాస్ గెలిచిన 25 మ్యాచ్ ల్లో ఓడిపోని ఇండియా
అడిలైడ్ వేదికగా, ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి పింక్ బాల్ టెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలవడంతో విరాట్ కోహ్లీ తన కెరీర్ లో 26 మ్యాచ్ లలో టాస్ ను గెలిచినట్లయింది. కోహ్లీ టాస్ గెలిచిన గత 25 టెస్టుల్లో ఒక్కదానిలో కూడా ఇండియా ఓడిపోలేదన్న సంగతి గమనార్హం.

ఇరు జట్ల ఆటగాళ్ల వివరాలు...
ఇండియా: మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, ఆర్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా: జోయ్ బుర్న్స్, మ్యాథ్యూ వేడ్, మార్నస్ లుబుస్ చేంజ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, టిమ్ పైనీ, పాట్ కుమాన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ జాహెల్ వుడ్.
India
Australia
Pink Ball
Test

More Telugu News