Kangana Ranaut: హృతిక్ రోషన్ ను మరోసారి టార్గెట్ చేసిన కంగన రనౌత్

Kangana Ranaut once again targets Hrithik Roshan
  • కంగన మెయిల్స్ కేసును క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేయాలని కోరిన హృతిక్
  • ఇంకెన్నాళ్లు ఏడుస్తావంటూ కంగన ఫైర్
  • జీవితంలో ముందుకు వెళ్లలేకపోతున్నాడని వ్యాఖ్య
కొన్ని రోజుల గ్యాప్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి టార్గెట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే, హృతిక్, కంగనల మధ్య ఓ పెద్ద యుద్ధమే జరిగిన సంగతి తెలిసిందే. 2013-14లో కంగన మెయిల్ ఐడీ నుంచి తనకు వందలాది మెయిల్స్ వచ్చాయని గతంలోనే ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు హృతిక్ ఫిర్యాదు చేశాడు. ఆ కేసును క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేయాలని తాజాగా కోరాడు. ఈ అంశంపై కంగన మండిపడింది.

హృతిక్ తన భార్య నుంచి విడాకులు తీసుకుని చాలా సంవత్సరాలవుతోందని, అలాగే హృతిక్-తాను విడిపోయి కూడా చాలా ఏళ్లవుతోందని కంగన తెలిపింది. భార్యతో విడిపోయిన తర్వాత హృతిక్ ఎవరితోనూ డేటింగ్ కూడా చేయలేదని చెప్పింది. అయినా తన జీవితంలో ఆయన ముందుకు వెళ్లలేకపోతున్నాడని వ్యాఖ్యానించింది. ఇతర విషయాలను వదిలేసి... ఒక చిన్న విషయం గురించి ఇంకెన్నాళ్లు ఏడుస్తావంటూ హృతిక్ పై మండిపడింది.
Kangana Ranaut
Hrithik Roshan
Bollywood

More Telugu News