Team India: రేపే తొలి టెస్ట్... టీమిండియా తుది జట్టు ఇదే!

Team India squad for first test against Australia
  • ఇండియా-ఆస్ట్రేలియాల మధ్య రేపటి నుంచి తొలి టెస్టు
  • అడిలైడ్ వేదికగా డే నైట్ మ్యాచ్
  • కేఎల్ రాహుల్ కు తుది జట్టులో దక్కని స్థానం
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా రేపటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. డేనైట్ ఫార్మాట్లో జరుగుతున్న ఈ టెస్టుకు టీమిండియా తుది జట్టును ప్రకటించింది. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలు ఇండియా ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. వికెట్ కీపర్ గా వృద్ధిమాన్ సాహాకు అవకాశం దక్కింది. స్టార్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కు జట్టులో స్థానం దక్కకపోవడం గమనార్హం. నలుగురు స్పెషలిస్టు బౌలర్లకు జట్టులో స్థానం కల్పించారు. పార్ట్ టైమ్ బౌలర్ గా హనుమ విహారి అందుబాటులో ఉండనున్నాడు.

టీమిండియా జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్.
Team India
Australia
First Test

More Telugu News