Budda Venkanna: మాస్కులు కూడా ఇవ్వలేనోడు వ్యాక్సిన్ ఇస్తాడా విజయసాయి రెడ్డీ?: బుద్ధా వెంకన్న

Budda venna commets on Vijayasai Reddy over Corona vaccine distribution
  • డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ప్రారంభం అన్న విజయసాయి
  • కరోనాను నియంత్రించడంలో విజయం సాధించామని వ్యాఖ్య
  • ట్విట్టర్ పాట్లు ఎందుకన్న వెంకన్న
డిసెంబర్ 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కానుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజలకు కనీసం మాస్క్ కూడా ఇవ్వలేక చేతులెత్తేసినవాడు... వ్యాక్సిన్ ఇస్తాడని పగటి కలలు కంటున్నావా? అని ఎద్దేవా చేశారు. నీ బుర్రకి తట్టే తప్పుడు లెక్కలు రాసుకోక.. ట్విట్టర్ పాట్లు ఎందుకు విజయసాయిరెడ్డీ అని ప్రశ్నించారు.

పారాసిటమాల్, బ్లీచింగ్, వైసీపీ ఏలూరు స్పెషల్ వాటర్ కలిపి, మిక్సీ కొట్టి జగన్ తయారు చేసిన కరోనా మందు తమకు కూడా ఇవ్వాలని ప్రపంచ దేశాల అధినేతలు... ఫార్ములా మాకు కూడా ఇవ్వాలని ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నాయా విజయసాయి? అని వెంకన్న ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు.
Budda Venkanna
Telugudesam
Vijayasai Reddy
YSRCP
Corona Virus
vaccine

More Telugu News