సోనియాను కలిసిన కోమటిరెడ్డి.. ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి!

16-12-2020 Wed 15:36
  • పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరిన కోమటిరెడ్డి
  • అదే పదవిని ఆశిస్తున్న రేవంత్ రెడ్డి
  • రాహుల్ గాంధీని కలవనున్న రేవంత్
Komati reddy meets Sonia and Revanth reached Delhi
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. రేసులో ముందు వరుసలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. పీసీసీ పదవిని చేపట్టే అన్ని అర్హతలు తనకు ఉన్నాయని, తనకు అవకాశాన్ని ఇవ్వాలని సోనియాను కోరారు.

ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబం సేవలందిస్తోందని... అధికార టీఆర్ఎస్ ను ఢీకొనగల సత్తా తమకు ఉందని చెప్పారు. మరోవైపు పీసీసీ పగ్గాలను ఆశిస్తున్న రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. రాహుల్ గాంధీని ఆయన కలవనున్నారు. పీసీసీ పదవిని తనకు ఇవ్వాలని రాహుల్ ను ఆయన కోరనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయో అనే ఉత్కంఠ తెలంగాణలో నెలకొంది.