Hansika: హన్సిక ప్రధాన పాత్రలో 'నషా' వెబ్ సీరీస్

Hansika plays key role in web series Nasha
  • సినిమాలు తగ్గడంతో ఓటీటీకి హన్సిక 
  • అమెజాన్ ప్రైమ్ కోసం 'నషా' వెబ్ సీరీస్
  • 'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వం
  • హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్  
మన కథానాయికలు ఇటు సినిమాలలో నటిస్తూనే.. అటు ఓటీటీ వైపు కూడా ఇప్పుడు అడుగేస్తున్నారు. ముఖ్యంగా వెబ్ సీరీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. పైగా, ఓటీటీ సంస్థలు మంచి పారితోషికాన్ని కూడా ఆఫర్ చేస్తుండడంతో ఇటువైపు ఆకర్షితులవుతున్నారు. ఇదే బాటలో ఇప్పుడు కథానాయిక హన్సిక కూడ అడుగేసింది.

తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించిన హన్సికకు సినిమాల పరంగా ఇప్పుడు డిమాండ్ తగ్గింది. దీంతో ఈ ముద్దుగుమ్మ వెబ్ సీరీస్ ను ఎంచుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం ఓ సీరీస్ చేసింది.

'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీరీస్ కి 'నషా' టైటిల్ని ఖరారు చేశారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ సీరీస్ పది ఎపిసోడ్లుగా ఉంటుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సీరీస్ ని వచ్చే ఏడాది నుంచి స్ట్రీమింగ్ చేస్తారు.
Hansika
Web Series
Nasha
Amezon

More Telugu News