Kerala: కేరళ స్థానిక ఎన్నికల్లో దూసుకెళుతున్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్... బీజేపీ నామమాత్రమే!

LDF and UDF Going to win Majority Seats in Kerala Local Body Polls
  • కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
  • మెజారిటీ స్థానాల్లో ఎల్డీఎఫ్ ఆధిక్యం
  • ఒక్క జిల్లా, కార్పొరేషన్ ను దక్కించుకోలేకపోతున్న ఎన్డీయే
కేరళలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి దూసుకువెళుతుండగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నామమాత్రపు ప్రభావంతోనే మిగిలింది. ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభం కాగా, దాదాపు అన్ని స్థానాల ట్రెండ్స్ బయటకు వచ్చాయి. మొత్తం 941 గ్రామ పంచాయితీ స్థానాలకు ఎన్నికలు జరుగగా, 916 చోట్ల తొలి ట్రెండ్స్ వెలువడ్డాయి. ఎల్డీఎఫ్ 476, యూడీఎఫ్ 378 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఎన్డీయే 25 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 37 చోట్ల ముందంజలో ఉన్నారు.

ఇక బ్లాక్ పంచాయితీల విషయానికి వస్తే, 152 స్థానాలకు ఎన్నికలు జరుగగా, ఎల్డీఎఫ్ 102 చోట్ల ఆధిక్యంలో ఉండి తిరుగులేని విజయం దిశగా వెళుతోంది. యూడీఎఫ్ 49 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఎన్డీయే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. జిల్లా పరిషత్ లను పరిశీలిస్తే, 14 జిల్లాలకు గాను ఎల్డీఎఫ్ 10, యూడీఎఫ్ 4 జిల్లాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి. ఒక్క జిల్లానూ ఎన్డీయే దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు.

మునిసిపాలిటీల విషయానికి వస్తే, 86 స్థానాలకు గాను యూడీఎఫ్ 39, ఎల్డీఎఫ్ 38, ఎన్డీయే 3, ఇతరులు 6 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగగా, ఎల్టీఎఫ్ 4 చోట్ల, యూడీఎఫ్ 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో అధికార, విపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగినట్టు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. ఈ సాయంత్రానికి తుది ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.
Kerala
Local Body Polls
LDF
UDF
NDA
BJP
Counting

More Telugu News