Bihar: ఎన్నికల హామీ అమలుకు పచ్చజెండా.. ఉచిత వ్యాక్సిన్‌కు బీహార్ కేబినెట్ ఆమోదం

  • నితీశ్ కుమార్ నేతృత్వంలో మంత్రి వర్గ స‌మావేశం
  • హామీని నెర‌వేర్చ‌నున్న‌ట్లు నితీశ్ కుమార్ ప్రకటన
  • ఏడు ఎన్నికల హామీల్లో ఉచిత క‌రోనా వ్యాక్సిన్ ఉందని వ్యాఖ్య
bihar will give free vaccine

బీహార్ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు  బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే బీహార్ ప్ర‌జ‌ల‌కు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందుకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో జ‌రిగిన మంత్రి వర్గ స‌మావేశంలో ఈ విషయంపై చర్చించి నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిక‌ల నేపథ్యంలో ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌నున్న‌ట్లు నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాము ఇచ్చిన ఏడు ఎన్నికల హామీల్లో ఉచిత క‌రోనా వ్యాక్సిన్ కూడా ఉందని అన్నారు.

రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యంగా ఉండాలనేదే త‌మ ఉద్దేశ‌మ‌ని ఆయ‌న తెలిపారు. బీహార్‌లో బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ పోటీ చేసి విజయం సాధించింది. బీజేపీ మేనెఫెస్టోలో ఉచిత వ్యాక్సిన్ నూ పొందుపర్చామని ఎన్నికల ముందు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్రకటన చేశారు.

More Telugu News